న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో టెర్మినల్ నిర్వహణ హక్కులను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్) గెలుచుకుంది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) కంపెనీ గతంలో టర్కీకి చెందిన సెలెబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసింది. పది నెలల తర్వాత ఈ కాంట్రాక్ట్‌ను వేరే కంపెనీకి ఇచ్చింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఐజీఐఏ) ను డీఐఏఎల్ ఆపరేట్ చేస్తుండగా, డీఐఏఎల్‌లో మెజార్టీ వాటా జీఎంఆర్ గ్రూప్ కంట్రోల్‌లో ఉంది.
జీఏఎల్‌కు డీఐఏఎల్ నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్ అందింది. దీని ప్రకారం జీఏఎల్ కార్గో టెర్మినల్ 1ను అప్‌గ్రేడ్ చేయడం, ఆధునీకరించడం, ఫైనాన్స్ చేయడం, ఆపరేట్ చేయడం, నిర్వహించడం, మెయింటైన్ చేయడం వంటి బాధ్యతలను తీసుకుంటుంది.
ఈ ప్రాజెక్ట్ రెవెన్యూ షేర్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. మొదటి ఏడాదిలో రూ.390 కోట్లను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు జీఏఎల్ ఇవ్వనుంది. మొదటి దశలో 2036 వరకు ఒప్పందం కుదిరింది.
