V6 News

మే బ్యాంక్ హాలిడేస్ లిస్ట్: ఎన్ని రోజులు సెలవులో ఉంటాయో తెలుసా?

మే బ్యాంక్ హాలిడేస్ లిస్ట్: ఎన్ని రోజులు సెలవులో ఉంటాయో తెలుసా?

మే నెల వచ్చేసింది. వేసవి సెలవుల సందడితో పాటు.. ఈ నెలలో బ్యాంకులకు కూడా వరుస సెలవులు ఉన్నాయి. మీరు బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులేవైనా ఉంటే.. ఈ హాలిడే లిస్ట్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం మే నెలలో పండుగలు, వేడుకలు, వారాంతపు సెలవులతో కలిపి బ్యాంకులు ఏఏ రోజులన మూతపడతాయో ఇప్పుడు తెలుసుకోండి.ఈ నెలలో ప్రధానంగా మే డే, బుద్ధ పౌర్ణమి, బక్రీద్ వంటి పండుగలు ఉన్నాయి. 

మే 2026 బ్యాంక్ సెలవుల జాబితా:

* మే 1 (శుక్రవారం): మే డే (కార్మికుల దినోత్సవం) / మహారాష్ట్ర దినోత్సవం / బుద్ధ పౌర్ణమి.
* మే 3 (ఆదివారం): వారాంతపు సెలవు.
* మే 9 (రెండవ శనివారం): బ్యాంక్ సెలవు. పశ్చిమ బెంగాల్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కూడా.
* మే 10 (ఆదివారం): వారాంతపు సెలవు.
* మే 16 (శనివారం): సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం (ఆ రాష్ట్రంలో మాత్రమే సెలవు).
* మే 17 (ఆదివారం): వారాంతపు సెలవు.
* మే 23 (నాల్గవ శనివారం): బ్యాంక్ సెలవు.
* మే 24 (ఆదివారం): వారాంతపు సెలవు.
* మే 27 (బుధవారం): ఈద్-ఉల్-అధా (బక్రీద్) - చాలా రాష్ట్రాల్లో సెలవు.
* మే 28 (గురువారం): బక్రీద్ సెలవు (కొన్ని ప్రాంతాల్లో రెండవ రోజు సెలవు ఉంటుంది).
* మే 31 (ఆదివారం): వారాంతపు సెలవు.

బ్యాంకులు భౌతికంగా క్లోజ్ అయినప్పటికీ.. కస్టమర్ల డిజిటల్ అవసరాల కోసం సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయాని మర్చిపోవద్దు. సెలవులతో సంబంధం లేకుండా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ సర్వీసులు సెలవులతో సంబంధం లేకుండా పని చేస్తాయి. అలాగే క్యాష్ విత్ డ్రా కోసం ఏటీఎంలు 24/7 అందుబాటులో ఉంటాయి. అయితే చెక్కుల క్లియరెన్స్ లేదా లోన్ అప్లికేషన్ వంటి పనుల కోసం సెలవులకు రెండు రోజుల ముందే బ్యాంకుకు వెళ్లడం మంచిది. సో సెలవులకు అనుగుణంగా మీ పనులను ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఆటంకం లేకుండా ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. 

ALSO READ : మే 1 నుంచి కొత్త గ్యాస్ బుక్కింగ్ రూల్స్..