- ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా ఆదివారం సాయంత్రం జీఎంఆర్ఆల్ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఒక్కరిలో వ్యాయామంపై ఆసక్తి పెంపొందించేలా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ట్రాక్ సూట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఛత్తీస్గఢ్రాష్ర్టంలోని దుర్గ్ కేంద్రంగా జనవరి 6 నుంచి ప్రారంభమయ్యే స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అండర్14 తెలంగాణ కబడ్డీ జట్టుకు ఎమ్మెల్యే సొంత ఖర్చుతో ట్రాక్ సూట్లను అందజేశారు. క్రీడాకారులకు శనివారం మైత్రి మైదానంలో అందజేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మైత్రి క్రికెట్ క్లబ్అధ్యక్షుడు హనుమంత్, సీఐలు వినాయక్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
