ఢిల్లీ ఎయిర్​పోర్టులో జీఎంఆర్​కు మరో 10 శాతం వాటా

ఢిల్లీ ఎయిర్​పోర్టులో జీఎంఆర్​కు మరో  10 శాతం వాటా

న్యూఢిల్లీ: గ్లోబల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ జీఎంఆర్​ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్​) ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ లిమిటెడ్ (డయల్)లో 10 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు  ఫ్రాపోర్ట్​ ఏజీ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (ఎస్​పీఏ)పై సంతకం చేసింది. ఇది126 మిలియన్ డాలర్ల విలువైన వ్యూహాత్మక ఒప్పందం. 

ఫలితంగా డయల్​లో జీఐఎల్​ హోల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  64 శాతం నుంచి 74 శాతానికి పెరుగుతుందని కంపెనీ సోమవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. జీఎంఆర్ ఎయిర్​పోర్ట్​ ఢిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. రూల్స్​ ప్రకారం ఎస్​పీఏ అమలైన తేదీ నుంచి 180 రోజులలోపు లావాదేవీ ముగుస్తుంది. కొనుగోలు తర్వాత డయల్​లో మిగిలిన 26 శాతం వాటా  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చేతిలో ఉంటుంది.