స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌‌‌‌ను ప్రారంభించనున్న జీఎంఆర్

స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌‌‌‌ను ప్రారంభించనున్న జీఎంఆర్

హైదరాబాద్: శిక్షణ పొందిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌‌‌‌ను తీర్చడానికి  ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్  మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్సులను బోధించే జీఎంఆర్​ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌‌‌‌ను ప్రారంభించబోతున్నట్లు జీఎంఆర్​ గ్రూప్ మంగళవారం తెలిపింది. ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్నది. ఈ సంస్థ విమానయానరంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలను సృష్టించగలుగుతుందని తెలిపింది. 

'ఆత్మనిర్భర్ భారత్' చొరవకు అనుగుణంగా మెయింటనెన్స్​, రిపెయిర్​, ఓవర్‌‌‌‌హాల్ (ఎంఆర్ఓ) పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. విమానాశ్రయంలోని జీఎంఆర్​ ఏరోస్పేస్  ఇండస్ట్రియల్ పార్క్‌‌‌‌లో ఈ స్కూల్ ఉంటుంది.  యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ,    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  కంబైన్డ్ బీ1.1, బీ2 ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ లైసెన్సింగ్ సర్టిఫై చేసిన ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ టైప్ ట్రైనింగ్‌‌‌‌తో పాటు పూర్తిగా నాలుగు -సంవత్సరాల ఏఎంఈ  ప్రోగ్రామ్‌‌‌‌ను ఇది అందిస్తుంది.