గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ కన్నుమూత

గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ కన్నుమూత

పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చనిపోయారు. కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న పారికర్… ఆరోగ్య పరిస్థితి ఇవాళ మరింత విషమించింది. 8గంటల సమయంలో ఆయన చనిపోయారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈమేరకు సీఎంవో ట్వీట్‌ చేసింది. మనోహర్‌ పారికర్ ప్యాక్రియాటిక్ క్యాన్సర్‌ తో బాధపడుతున్నారు. దీంతో ఆయన కొద్దిరోజుల పాటు అమెరికాలో చికిత్స పొందారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌, గోవా, ముంబయిలోనూ ఆయన చికిత్స తీసుకున్నారు. అయితే గతనెలలో మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఇవాళ హస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మనోహర్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు.

మనోహర్ పారికర్‌ తొలిసారి 1994లో గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్న పారికర్‌ మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి సీఎం అయ్యారు. 2005 జనవరిలో నలుగురు BJP  ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా తన ట్యాలెంట్ తో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, దిగంబర్ కామత్‌ కు సీఎం అయ్యారు. అయితే, 2012 అసెంబ్లీ ఎన్నికలలో BJP మెజారిటీ సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు.