గోదావరి@50.6

గోదావరి@50.6
  • కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

  • అధికారుల అలర్ట్

  • పరిశీలించిన మంత్రి 


భద్రాచలం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అంతకంతకూ వరద ఉధృతి పెరుగుతోంది. కాగా భద్రాచలం వద్ద నిన్న సాయంత్రం 48 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. ఇవాళ ఉదయానికి  గరిష్టంగా 50.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. 50.6 అడుగులకు నీటిమట్టం చేరిన తర్వాత వరద ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పట్టింది.

మరోవైపు గోదావరికి వస్తున్న వరదతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు గ్రామాల ప్రజలను వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఇప్పటికే ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

కాగా గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కాగా.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో రివ్యూ మీటింగ్ పెట్టారు. జిల్లా కలెక్టర్ జితేంద్ర వి పాటిల్ తో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు