1986 తర్వాత ఇదే మొదటిసారి

1986 తర్వాత ఇదే మొదటిసారి

హైదరాబాద్, వెలుగు: గోదావరి, దాని ఉప నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేవలం 15 రోజుల్లోనే రెండు వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో కలిశాయి. 1986 తర్వాత జులైలోనే గోదావరి నుంచి బంగాళాఖాతంలో ఇంత భారీగా నీళ్లు చేరడం ఇదే మొదటిసారి అని ఇంజనీర్లు చెప్తున్నారు. జూన్ నుంచి ఈ నెల 12 వరకు గోదావరిలో చెప్పుకోదగ్గ ప్రవాహాలు లేవు. 42 రోజుల్లో 40 టీఎంసీలు మాత్రమే ఈ నది నుంచి ధవళేశ్వరం బ్యారేజీ దాటి సముద్రంలో చేరాయి. అయితే.. 13 నుంచి వరుసగా గోదావరి నుంచి భారీ ఎత్తున నీళ్లు బంగాళాఖాతంలోకి చేరుతున్నాయి. 13 నుంచి 27 వరకు 2వేల టీఎంసీలకుపైగా నీళ్లు సముద్రంలో చేరాయి. ఈ సీజన్‌‌లో ఈ నెల 12 వరకు 40 టీఎంసీలు సముద్రంలో చేరగా.. 13న 106, 14న 130, 15న 133, 16న 161, 17న 204, 18న 223, 19న 200, 20న 169, 21న 160, 22న 130, 23న 109,  24న 90, 25న 97, 26న 80, 27న 83 టీఎంసీలు సముద్రంలోకి చేరాయి. ఈ సీజన్ లోనే అత్యధికంగా 18న 223 టీఎంసీలు సముద్రంలో చేరాయి. గోదావరి, దాని ఉప నదుల్లో మళ్లీ ప్రవాహాలు పెరుగుతున్నాయి. దీంతో ఈ ఫ్లడ్ సీజన్ లో రికార్డు స్థాయిలో నీళ్లు బంగాళాఖాతంలో చేరే అవకాశముంది.