
గోదావరిఖని, వెలుగు : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చాలామంది ఇంజినీరింగ్, డిప్లొమా స్టూడెంట్స్ కొత్త పరికరాలను కనిపెడుతున్నరు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన భగత్ ప్రశాంత్ డిప్లొమా స్టూడెంట్. షేక్ హ్యాండ్ వల్లే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని గుర్తించిన ఇతను వాచ్‌లాంటి పరికరం తయారు చేశాడు. దీన్ని చేతికి పెట్టుకుని ఎవరికైనా షేక్‌హ్యాండ్ ఇవ్వబోయినా, అలాగే మన కళ్ళను, ముక్కును తాకే ప్రయత్నం చేసినా బజర్మోగుతుంది. తయారీ కోసం బ్యాటరీ, వాచ్ బెల్ట్, బైక్ ఇండికేషన్ బజర్, ఎల్‌ఈడీ లైట్, స్విచ్, బాటిల్, ఐరన్ బోల్ట్ ఉపయోగించానని, రూ.50 మాత్రమే ఖర్చయ్యాయన్నాడు. ఆర్డర్ఇస్తే తయారు చేసి ఇస్తానని, 8341904658లో సంప్రదించాలన్నాడు.