గోదావరి పుష్కర పనులకు రూ.46.65 కోట్లు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

గోదావరి పుష్కర పనులకు రూ.46.65 కోట్లు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో గోదావరి పుష్కరాల నిర్వహణకు ఇరిగేషన్​ శాఖకు రూ.46.65 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 400 మీటర్ల కొత్త కరకట్ట, 300 మీటర్ల పాత కరకట్ట రిపేర్లు, విగ్రహాల ఏర్పాటు, చిన్న ఆలయాల ఆధునీకరణ తదితర పనుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని 8 జిల్లాల్లో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ ద్వారా రూ.241.14 కోట్లతో అభివృద్ధి​పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్​ జీవో  నంబర్​ 359 జారీ చేశారు.