గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి గోదావరిఖనిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ను పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ యువతను వ్యసనాల నుంచి బయటపడేయడానికి ఇలాంటి చికిత్స కేంద్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, డాక్టర్లు అరుణ, కృపాబాయి, రాజు, రవివర్మ పాల్గొన్నారు.
