గోద్రెజ్ ఫుడ్స్లో ఫార్మ్ టు ఫోర్క్ విధానం.. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవచ్చు..

గోద్రెజ్ ఫుడ్స్లో ఫార్మ్ టు ఫోర్క్ విధానం..  మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో  తెలుసుకోవచ్చు..

హైదరాబాద్, వెలుగు: మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో  తెలుసుకోవడానికి వాడే 'ఫార్మ్ టు ఫోర్క్' ట్రేసబిలిటీ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ను గోద్రేజ్ ఫుడ్స్ అమలు చేస్తోంది.

ఆహార పదార్థాలు పొలంలో  పండినప్పటి నుంచి, అవి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా దశలను దాటి వినియోగదారుడి ప్లేట్ లేదా వంటగదికి చేరే వరకు జరిగే పూర్తి ప్రయాణాన్ని ఈ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచిస్తుంది. 

 కంపెనీ మార్కెటింగ్ హెడ్ అనుశ్రీ దేవెన్ మాట్లాడుతూ, ఈ విధానం వల్ల సేకరణ, నాణ్యత నిర్వహణపై మెరుగైన నియంత్రణ లభిస్తుందన్నారు. సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పారదర్శకతను పెంచుతూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి ఈ ఫార్మ్ టు ఫోర్క్ విధానాన్ని కచ్చితంగా అనుసరిస్తున్నామని  ఆమె తెలిపారు.