పెట్ ఫుడ్ విభాగంలోకి గోద్రెజ్

పెట్ ఫుడ్ విభాగంలోకి గోద్రెజ్

హైదరాబాద్​, వెలుగు: గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అనుబంధ సంస్థ గోద్రేజ్ పెట్ కేర్ ‘నింజా’ బ్రాండ్ పేరుతో కుక్కల కోసం పోషకాహారాన్ని అందుబాటులోకి తెచ్చింది. తమిళనాడులో విజయవంతమైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చింది.

దేశీయ పెట్ ఫుడ్ మార్కెట్ విలువ రూ.ఆరు వేల కోట్లకు చేరింది.  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాలను సంస్థ కీలక కేంద్రాలుగా భావిస్తోంది. తదుపరి కొన్ని ఏళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడితో తన వ్యాపారాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆహారం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, ధరలు రూ.20 నుంచి రూ.640 వరకు ఉంటాయని గోద్రెజ్​ తెలిపింది.