
మెహిదీపట్నం, వెలుగు: మానవుని నిత్యజీవితంలో వ్యాయామం భాగస్వామ్యం కావాలని, అప్పుడే జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందని గోల్కొండ ఏసీపీ ఫయాజ్ అన్నారు. ఆదివారం వరల్డ్ హార్ట్ డే ను పురస్కరించుకొని లంగర్ హౌస్ లోని రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో 3కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏసీపీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రస్తుతం మనిషి జీవితం యాంత్రికంగా మారి నిరంతరం ఒత్తిడికి గురవుతోందన్నారు. మానవుని జీవితం ఆరోగ్యకంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరన్నారు. ర్యాలీని బాపు ఘాట్ నుంచి లంగర్ హౌస్ ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్లు సోయబ్, శివకుమార్, నగేశ్, రిటైర్డ్ ఏసీపీ జగ్గారావు పాల్గొన్నారు.