ఢిల్లీలో గోల్కొండ ఎంపోరియం షురూ

 ఢిల్లీలో గోల్కొండ ఎంపోరియం షురూ

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో పునరుద్ధరించిన ‘గోల్కొండ హస్తకళ ఎంపోరియం’ను రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఎండీ శైలజా రామ అయ్యర్​కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సంస్కృతీ వారసత్వాలకు చిహ్నమైన గోల్కొండ కోట పేరుతో లక్ష మంది హస్తకళాకారులు, చేనేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించడమే తమ లక్ష్యమన్నారు.

ఈ ఎంపోరియంలో తెలంగాణ గర్వకారణమైన వెండి ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, లక్క గాజులు, డోక్రా కళారూపాలతో పాటు గద్వాల్, పోచంపల్లి, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట చీరలు, కొండపల్లి, ఏటికొప్పాక వంటి ఇతర రాష్ట్రాల ప్రముఖ కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు.