ఇరాన్ అమెరికా పీస్ డీల్ ఫైనల్ కి చేరుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లలో ఒడిదొడుకులకు బ్రేక్ పడింది. దీంతో క్రమంగా వాటి ధరలు తగ్గుతూ కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు రిటైల్ షాపింగ్ చేయటానికి ముందుగా తమ నగరాల్లోని అమ్మకపు ధరలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది.
జూన్ 18న బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. జూన్ 17న హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 110గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 850గా మార్పులు లేకుండా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 18, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 70వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.270 దగ్గర ఉంది.
