బంగారానికి ఉన్న డిమాండ్ ఆధారంగా అక్రమ మార్గాలలో దేశంలోకి తీసుకొచ్చేందుకు కొందరు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. 2025 నవంబర్ 16వ తేదీన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా బంగారం తెస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారు. ఐరన్ బాక్స్ లో బంగారు కడ్డీలు దాచిపెట్టి వచ్చిన వ్యక్తి నుంచి గోల్డ్ ను సీజ్ చేశారు .
షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రయానికుని దగ్గర 11 బంగారం కడ్డీలను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. నిందితుడు బంగారాన్ని ఐరన్ బాక్స్ లో అమర్చుకుని తరలించేందుకు ప్రయత్నంచి అడ్డంగా బుక్కయ్యాడు. బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు .
బంగారు కడ్డీలను ప్యాక్ చేసి డిటెక్టర్ గుర్తు పట్టుదులే అన్న ధీమాతో ఐరన్ బాక్స్ లో పెట్టి తీసుకొచ్చాడు. పట్టుబడ్డ బంగారం విలువ 1196.20 గ్రాములు అని అధికారులు తెలిపారు. దాదాపు కోటి55 లక్షల రూపాయలు ఉందని అంచనా వేశారు.
