భువనగిరిలో దారుణం.. చనిపోయిన మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారం కొట్టేశారు !

భువనగిరిలో దారుణం.. చనిపోయిన మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారం కొట్టేశారు !

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరిలో దారుణం జరిగింది. మృతదేహంపై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును దుండగులు మాయం చేశారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిలో చనిపోయిన మహిళ మెడ నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు మాయమైన ఘటన కలకలం రేపింది. వలిగొండ (మ) వర్కట్ పల్లికి చెందిన సుష్మిత అనే గర్భవతికి దమ్ము ఎక్కువగా వస్తుండటంతో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆమె భర్త నాగరాజు ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చాడు.

తెల్లవారుజామున నాలుగు గంటలకు సుస్మిత చికిత్స పొందుతూ చనిపోయింది. పోస్టుమార్టం సమయంలో సుస్మితపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకోండని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమె ఒంటిపై ఉన్న బంగారం గురించి చూడగా.. అప్పటికే ఆమె మెడలోని మూడు తులాల పుస్తెలా తాడు కనిపించలేదు. ఈ ఘటనపై.. ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు పోలీసులకు సుస్మిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.