యోగా సూర్యనమస్కారాల్లో తండ్రి, కూతురికి గోల్డ్​ మెడల్స్

యోగా సూర్యనమస్కారాల్లో తండ్రి, కూతురికి గోల్డ్​ మెడల్స్

బచ్చన్నపేట,వెలుగు: యోగా, సూర్యనమస్కారం పోటీలో తండ్రి, కూతురు గోల్డ్​మెడల్​తోపాటు​ నగదు బహుమతులు సాధిందిచారు.   బచ్చన్నపేట మండలం ఆలిపూర్​ కు చెందిన మంతపురి గణేశ్​తోపాటు, అతని కూతురు హాసిని రాష్ట్ర స్థాయి సూర్య నమస్కారం పోటీల్లో  ప్రతిభ చూపి గోల్డ్​ మెడల్​ సాధించారు. ఆదివారం  సిద్దిపేట జిల్లా కేంద్రంలో  ఈ  పోటీలు  నిర్వహించారు.

400మంది పోటీలోపాల్గొనగా  గణేష్​  గోల్డ్​ మెడల్ సాధించాడు. కూతురు హాసిని 661 సూర్య నమస్కారాలు చేసి మహిళా విభాగంలో మొదటి స్థానంలో గోల్డ్​ మెడల్​తోపాటు రూ.5వేల నగదు బహుమతి అందుకుంది.