కబోర్ట్ లోని నగలు, రూ.10 లక్షలు మాయం..బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి జూబ్లీహిల్స్ పోలీసులు

కబోర్ట్ లోని  నగలు, రూ.10 లక్షలు మాయం..బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి జూబ్లీహిల్స్ పోలీసులు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్​-33లో నివాసముంటున్న శోభారాణి (60), కృష్ణ ప్రసాద్ దంపతుల ఇంట్లో దొంగతనం జరిగింది. శోభారాణి మంగళవారం తన ఇంట్లోని కబోర్డ్​ను తనిఖీ చేయగా, అందులో భద్రపరిచిన రెండు బంగారు గాజులు, రెండు బంగారు చైన్లు, రూ.10 లక్షల నగదు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీమ్​తో తనిఖీలు చేపట్టారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.