తిరుమలలో వరాహస్వామి విమాన ప్రాకారానికి బంగారు తాపడం

తిరుమలలో వరాహస్వామి విమాన ప్రాకారానికి బంగారు తాపడం

డిసెంబర్ 6 నుంచి 10 వరకు  మహా సంప్రోక్షణ

తిరుపతి: తిరుమలలో భూ వరాహస్వామి ఆలయ విమాన ప్రాకారానికి బంగారు తాపడం అమర్చాలని టీటీడీ నిర్ణయించింది. వచ్చే డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు తిరుమలలో శ్రీ భూవరాహస్వామి వారి ఆలయంలో బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నవిషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీ రాత్రి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. బంగారు తాపడం అమర్చే పనులు ఆరు నెలలు జరుగుతాయి. పనులు నిర్విఘ్నంగా సాగేందుకు ఆరు నెలల పాటు శ్రీ భూ వరాహ స్వామి వారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి ఉంటుంది.  ఈ నేపధ్యంలో ఆలయంలోని యగశాలలో డిసెంబరు 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ మకర లగ్నంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమ పండితులు, ఆలయ అర్చకులు నిర్వహిస్తారు.