పసిడి ప్రియులకు షాక్: రూ.1200 పెరిగిన బంగారం ధర.. వెండి మాత్రం నిలకడ!

పసిడి ప్రియులకు షాక్: రూ.1200 పెరిగిన బంగారం ధర.. వెండి మాత్రం నిలకడ!

న్యూఢిల్లీ:  వరుసగా నాలుగు రోజుల తగ్గుదల తర్వాత బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. పది గ్రాముల ధర రూ.1,200 పెరిగి రూ.1.44 లక్షలకు చేరింది. వెండి ధర మారలేదు. కిలో రూ.2.30 లక్షల వద్ద స్థిరంగా ఉంది. ఇరాన్​ చమురు క్షేత్రాలపై దాడులను ట్రంప్ ఐదు రోజులు నిలిపివేయడం వల్ల మదుపర్లలో సానుకూలత కనిపించింది. విదేశీ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.38 శాతం పెరిగి 4,423.83 డాలర్లకు చేరింది. వెండి ధర కూడా 1.03 శాతం లాభపడింది. దేశీయ మార్కెట్లో తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు పెరగడం వల్ల బంగారం ధరకు మద్దతు లభించింది.