పెరిగిన బంగారం ధర..ఎంతంటే..

పెరిగిన బంగారం ధర..ఎంతంటే..

న్యూఢిల్లీ:  గ్లోబల్ మార్కెట్లలో ధరలు పెరగడంతో, ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర సోమవారం రూ.550 పెరిగి రూ.97,350కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం శుక్రవారం 10 గ్రాములకు రూ.96,800 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ.550 పెరిగి, సోమవారం 10 గ్రాములకు రూ.96,900కి చేరింది. వెండి ధర రూ.1,400 తగ్గి కిలోకు రూ.96,700కి చేరింది. హైదరాబాద్‌లో గోల్డ్ ధర (99.9 స్వచ్చత)  రూ.95,730 పలుకుతోంది.