ఎలక్ట్రానిక్ పరికరాల్లో బంగారం తరలింపు..పట్టుకున్న అధికారులు

ఎలక్ట్రానిక్ పరికరాల్లో బంగారం తరలింపు..పట్టుకున్న అధికారులు

శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు వద్ద నుంచి 435.760 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ  23లక్షల14 వేలు ఉంటుందని చెప్పారు. 

షార్జా నుంచి ఓ వ్యక్తి ఎలక్ట్రానిక్ పరికరాలతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాడు. అయితే అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వాటిని ఓపెన్ చేసి చెక్ చేయగా అందులో బంగారం ఉంది. దీంతో అక్రమంగా తరలిస్తున్నందుకు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ యాక్ట్ 1962, సెక్షన్ 110 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.