
బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. కేవలం నెల రోజుల్లో పది గ్రాముల పసిడి ధర రూ.1130 పెరిగింది. తాజాగా ఇవాళ(శుక్రవారం) 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.300 పెరుగుదలతో రూ.33,170కు చేరింది. మరోవైపు బంగారం ధర బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. కేజీ వెండి ధర రూ.150 పెరుగుదలతో రూ.37,550కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది.
ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,150కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,620కి పెరిగింది. కేజీ వెండి ధర రూ.39,400కు చేరింది.