Golden Globes 2026 Winners: అడాల్‌‌సెన్స్కు గోల్డెన్ గ్లోబ్ గౌరవం.. విజేతల ఫుల్ లిస్ట్

Golden Globes 2026 Winners: అడాల్‌‌సెన్స్కు గోల్డెన్ గ్లోబ్  గౌరవం.. విజేతల ఫుల్ లిస్ట్

ప్రపంచ సినిమా, టెలివిజన్ రంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో ఒకటి  ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ .  ప్రతి ఏడాది హాలీవుడ్‌‌లో ఘనంగా నిర్వహించబడే ఈ అవార్డులు ఆస్కార్ అవార్డులకు ముందస్తు సూచికగా భావించబడతాయి. జనవరి 11న  83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్  ప్రదానోత్సవం కాలిఫోర్నియాలోని  బెవర్లీ హిల్స్‌‌లో అట్టహాసంగా జరిగింది.

2025లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటుల ప్రతిభకు ఈ వేడుక వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా  ‘అడాల్‌‌సెన్స్ ’   సిరీస్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. పలు కీలక విభాగాల్లో ఈ సిరీస్ అవార్డులను దక్కించుకుంది. తనదైన నటనతో మెప్పించిన ఓవెన్ కూపర్ ఉత్తమ సహాయనటుడిగా అతి చిన్న వయసులోనే ఈ అవార్డును సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించాడు. 

అలాగే ఈ సిరీస్‌‌కు గాను  ఉత్తమ నటుడిగా స్టీఫెన్ గ్రాహం అవార్డును అందుకున్నాడు. గతేడాది నెట్‌‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్‌‌కి వచ్చిన ఈ సిరీస్ కొన్నాళ్లపాటు నెంబర్‌‌‌‌ వన్‌‌ ప్లేస్‌‌లో ట్రెండ్ అయ్యింది.  తెలుగుతో సహా పలు భాషల్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం నాలుగు ఎపిసోడ్స్‌‌ ఉన్న ఈ సిరీస్‌‌పై  వరల్డ్‌‌ వైడ్‌‌గా ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌‌లోనూ సత్తా చాటింది. దాదాపు గంట నిడివితో ఉన్న ఒక్కో ఎపిసోడ్‌‌ను సింగిల్‌‌ షాట్‌‌లో చిత్రీకరించడం ఇందులో మెయిన్‌‌ హైలైట్‌‌.  కథ విషయానికొస్తే.. ఇంగ్లాండ్‌‌కు చెందిన జేమీ మిల్లర్ (ఓవెన్ కూపర్) అనే 13 ఏళ్ల కుర్రాడు.. తన క్లాస్‌‌మేట్‌‌ అయిన కేటీ అనే అమ్మాయిని చంపాడనే ఆరోపణతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. 

జైలు పాలైన కొడుకు కోసం తండ్రి ఎడ్డీ మిల్లర్ (స్టీఫెన్ గ్రాహమ్) ఏం చేశాడు, అసలు మర్డర్ చేసిందెవరు,  హత్యకు దారితీసిన కారణాలు ఏమిటి,  పోలీస్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ ఎలా జరిగింది. జేమీ విడుదల అయ్యాడా లేదా అనేది మిగతా కథ. ఈతరం టీనేజ్‌‌ పిల్లల ప్రవర్తన, వాళ్ల భావోద్వేగాల నేపథ్యంలో సందేశాత్మకంగా దీన్ని తెరకెక్కించారు దర్శకుడు ఫిలిప్ బరాంటిని.  హాలీవుడ్‌‌లోని అతిపెద్ద అవార్డులలో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్‌‌కు స్టాండప్  కమెడియన్ నిక్కీ గ్లేజర్‌‌‌‌తో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రెజెంటర్‌‌‌‌గా  వ్యవహరించడం హైలైట్‌‌గా నిలిచింది. ఆమె భర్త నిక్ జోనాస్‌‌తో కలిసి రెడ్ కార్పెట్‌‌పై రొమాంటిక్ పోజులతో సందడి చేయగా ఫొటోలు వైరల్‌‌గా మారాయి.  

గోల్డెన్ గ్లోబ్స్ 2026 ముఖ్య విజేతలు :

  • ఉత్తమ నటుడు (టీవీ సిరీస్): స్టీఫెన్ గ్రాహం – అడాల్‌‌సెన్స్
  • ఉత్తమ నటి: రోజీ బేర్నీ – ఇఫ్ ఐ హేడ్ లెగ్స్ ఐ డిడ్ కిక్ యూ
  • ఉత్తమ స్క్రీన్‌‌ప్లే: పాల్ థామస్ – వన్ బ్యాటిల్ ఆనథర్
  • ఉత్తమ సహాయ నటుడు (టీవీ సిరీస్): ఓవెన్ కూపర్ – అడాల్‌‌సెన్స్
  • ఉత్తమ సహాయ  నటుడు (సినిమా): స్టెలన్ – సెంటిమెంట్ వాల్యూ
  • ఉత్తమ సహాయ  నటి (సినిమా): టెయానా టేలర్ – వన్ బ్యాటిల్ ఆనథర్
  • ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ – వన్ బ్యాటిల్ ఆనథర్
  • ఉత్తమ సహాయ నటుడు (సినిమా): స్టెలన్ – సెంటిమెంట్ వాల్యూ
  • ఉత్తమ సహాయ నటి (సినిమా): టేయానా టేలర్ – వన్ బ్యాటిల్ ఆనథర్