
భాగ్యనగరంలో గోల్కొండ బోనాల జాతర ప్రారంభమైంది. ఈ పండుగ నెల రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా జగదాంబిక అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఊరేగింపులో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు. మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి లు కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ రోజు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులు ఎంతో సంబరంగా జరపుకొనే పండగ ఇదని అన్నారు. ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 15 కోట్ల రూపాయలు కేటయించారని మంత్రి తెలిపారు. అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో బోనాల పండగను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ రోజు మొదటి బోనంతో పండగను ప్రారంభించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరవాత రాష్ట్ర పండుగగా బోనాలు జరుపుకుంటున్నామన్నారు. బోనాల పండగకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటయించారని తెలిపారు. గోల్కొండ ప్రాంతానికి సంబంధించి బోనాలకు అన్ని ఏర్పాట్లును అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పని చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి తలసాని.
హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. అందరికి బోనాలు పండుగ శుభాకంక్షాలు తెలపారు. ఈ పండుగ కోసం సీఎం కేసీఆర్ 15 కోట్ల రూపాయలను కేటయించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత బోనాలు పండుగని ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. నెల రోజు వైభవంగా జరుపుకునే ఈ పండుగ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందన్నారు. బోనాల జాతర సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు సీపీ ఆనంద్ తెలిపారు.