పెద్దోళ్ళకి ఇవి పెట్టండి 

పెద్దోళ్ళకి ఇవి పెట్టండి 

స్ర్కాంబుల్డ్‌‌ ఎగ్స్‌‌
ఎగ్స్‌‌లో ప్రొటీన్‌‌ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఉండే విటమిన్‌‌ – డి, విటమిన్‌‌ బి – 12, కొలైన్‌‌, సెలీనియమ్‌‌ కండరాల బలానికి ఉపయోగపడుతుంది. గుడ్డులో కొలస్ట్రాల్​ ఎక్కువగా ఉంటుందనే అనుమానం ఉంటే కేవలం ఎగ్‌‌వైట్స్‌‌ తింటే సరిపోతుంది. వైట్స్​తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు.
స్మూతీస్‌‌
పండ్లు లేని వాళ్లకు స్మూతీస్‌‌ బాగా ఉపయోగపడతాయి. ఫ్రూట్స్‌‌, వెజిటబుల్స్‌‌ను వాళ్లు కొరికి తినలేరు. అందుకే, అరటిపండు, స్ట్రాబెరి, పాలకూర లాంటి వాటితో స్మూతీస్‌‌  చేసుకోవచ్చు. వాటివల్ల పోషకాలు అందుతాయి. జీర్ణానికి సంబంధించిన సమస్య లేనివాళ్లకి వాటిల్లోనే కొద్దిగా ప్రొటీన్‌‌ పౌడర్‌‌‌‌, పాలు కలిపి ఇవ్వొచ్చు. 
ఓట్‌‌మీల్‌‌
ఓట్స్‌‌ తినేందుకు మెత్తగా ఉంటాయి, తొందరగా అరుగుతాయి. అందుకని పెద్దవాళ్లకు ఓట్స్‌‌తో వెరైటీలు చేసి పెట్టొచ్చు. వాటిల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. ఒక ఓట్‌‌మీల్‌‌లో నాలుగు గ్రాముల డైటరీ ఫైబర్‌‌‌‌ ఉంటుంది. దాంట్లోనే కొద్దిగా కిస్​మిస్​, అవిస గింజల పొడి‌‌ కూడా వేస్తే మరిన్ని హెల్త్‌‌ బెనిఫిట్స్‌‌ వస్తాయి. 
పెరుగు
పెరుగు ఏ వయసువారికైనా చాలామంచిది. దాంట్లో క్యాల్షియం, ప్రొటీన్‌‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి.  ప్రొబయోటిక్స్‌‌ జీర్ణ వ్యవస్థను హెల్దీగా ఉంచుతాయి. అందుకే, పెద్దవారికి పెరుగు పెట్టడం మంచిది. పెరుగు తింటే ఈస్ట్‌‌  వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్‌‌ తగ్గుతాయి. 
కాటేజ్‌‌ చీజ్‌‌
కాటేజ్‌‌ చీజ్‌‌, పనీర్‌‌‌‌ కూడా పండ్లు లేనివారికి పెట్టే డైట్‌‌లో చేర్చాలి. దాంట్లో చాలా న్యూట్రియెంట్స్‌‌ ఉంటాయి. ప్రొటీన్‌‌, క్యాల్షియం పెద్దవాళ్లకు చాలా అవసరం. అంతేకాకుండా బ్లడ్‌‌ షుగర్‌‌‌‌ లెవల్స్‌‌ను కూడా కంట్రోల్‌‌ చేస్తుంది.