Good Health : సీతాఫలం.. తింటే ఎంత బలమో తెలుసా..

Good Health : సీతాఫలం.. తింటే ఎంత బలమో తెలుసా..

సీజనల్ దొరికే పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండు రుచితో పాటు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. సీతాఫలంతో పాటు ఈ చెట్టు పువ్వు, వేర్లు, ఆకులు, బెరడును ఆయుర్వేదంలో ఔషధాల తయారీకి వాడతారు. సీతాఫలాన్ని రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్తున్నాడు డాక్టర్ సంజయ్ సేతి.

  • యాపిల్ లో కంటే   సీతాఫలంలోనే క్యాలరీలు ఎక్కువ. దానివల్లశరీరానికి కావాల్సిన శక్తి త్వరగా అందుతుంది. 
  • పొటాషియం కండరాల బలహీనతను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. సీతాఫలం పొడిని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే డయేరియా తగ్గుతుంది.
  •  ఇందులోని మెగ్నీషియం, సోడియం, పొటాషియం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది.
  • సీతా ఫలంలోఉండే యాంటీఇన్ప్లమేటరీ లక్షణాలు అల్సర్లను తగ్గించి ఎసిడిటీని పోగొడతాయి. కడుపులో ఇన్ఫెక్షన్స్ రానీయదు. 100 గ్రాముల సీతాఫలంలో ఒక యాపిల్ లో ఉండేదానికన్నా ఎక్కువ ఫైబర్, ఆరెంజ్ లో కన్నా ఎక్కువ విటమిన్ -సి ఉంటాయి.
  • ఇందులో ఉండే యాంటీ ట్యూమర్, యాంటీ ఒబెసిటీ, యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్, యాంటీఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ రోగాల నుంచి కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తాయి. కాన్సర్, కరొనరీ హార్ట్ డిసీజ్ల బారిన పడకుండా చేస్తాయి. 
  • థయమిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ - బి6 ఉంటాయి. ఇవి న్యూరాన్లలో కెమికల్ లెవల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచి డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తాయి.
  •  సీతాఫలాన్ని తేనెతో కలిపి తింటే ఈజీగా బరువు పెరగొచ్చు.
  • చర్మం పొడిబారడాన్ని, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
  •  సీతాఫలం గింజలు, పొట్టులో అనోనాసిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. పార్కిసన్స్ మెడిసిన్ వాడేవాళ్లు సీతాఫలం తినకూడదు.

ALSO READ :- Health History : ఓఆర్ఎస్ ఎలా పుట్టింది.. ఆలోచన ఎవరిది.. ఆ చిట్కా ఏంటీ..!