
హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) మళ్ళీ సంక్రాంతికి సిద్దమవుతున్నాడు. తనకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకు కూడా వచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమాలో నటించాలనుకునే వారి కోసం బంపరాఫర్ ఇచ్చారు మేకర్స్.ఇవాళ శ్రీరామ నవమి సందర్బంగా కాస్టింగ్ కాల్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే, ఇందుకోసం ఉండాల్సిన క్వాలిటీస్ కూడా ప్రస్తావించారు.గోదావరి స్లాంగ్ మాట్లాడేవారు కావాలంటూ తెలిపారు.
ఈ సినిమాలో నటించడానికి పిల్లలు, పెద్దలు కావాలని వారి వయస్సును కూడా మెన్షన్ చేస్తూ అనౌన్స్ చేశారు.ఇక ఆలస్యం ఎందుకు..ఈ సినిమా పై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు VENKYANILO3@GMAIL.COM లేదా వాట్సాప్ 8247812007 కి మీకు సంబంధించిన యాక్టింగ్ వీడియోలు పంపాలంటూ మేకర్స్ కోరారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించబోతున్నాడు.కాగా లాంఛింగ్ సెర్మనీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
To all the amazing talents out there?
— Sri Venkateswara Creations (@SVC_official) April 17, 2024
Join the team of a most entertaining film coming from the Blockbuster combo @VenkyMama & @AnilRavipudi ❤️?#VenkyAnil3 are looking for new actors who are fluent in Godavari Accent?
Share your profiles to venkyanil03@gmail.com or
WhatsApp… pic.twitter.com/IRSFEb0AYs
అంతేకాకుండా హీరో వెంకటేష్ కు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. అందుకే ఈ సినిమాను 2025 సంక్రాంతి రిలీజ్ చేయబోతున్నారట. అలాగే సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చేలా 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ను ఫిక్స్ చేశారట మేకర్స్.
ఇటీవలే సైంధవ్ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్..ఆ సినిమాతో అభుమానులను అలరించలేకపోయాడు. చాలా కాలం తరువాత వెంకటేష్ యాక్షన్ మోడ్ లో కనిపించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో వెంకీ F2,F3 వంటి సూపర్ హిట్ కాంబోలో సినిమా తీయడమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట.దిల్ రాజు బ్యానర్ లో 58వ సినిమాగా తెరకెక్కనుంది.