గుడ్ బై 2023.. అప్పుడే మొదలు పెట్టేశారు

గుడ్ బై 2023.. అప్పుడే మొదలు పెట్టేశారు

2023 ఏడాది ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉండగానే గుడ్ బై చెప్పేస్తున్నారు నెటిజన్లు.అదీ ఎలాగంటే.. హస్యాస్పదమైన మీమ్స్తో  షేర్ చేస్తూ.. పాత సంవత్సరం 2023కు గుడ్ బై చెప్తూ.. కొత్త ఏడాది 2024కు స్వాగతం పలుకుతున్నారు. 18 రోజులు మిగిలి ఉండగానే ఇంటర్నెట్ లో 2023 వీడ్కోలు మీమ్స్, మేసేజ్  ప్రవాహం సాగుతోంది. పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ ఫారూఖ్ 2023 కు గుడ్ బై చెబుతూ మీమ్స్ ను X లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది (2023)లో ఏమీ సాధించకుండానే  నేను నా ఫ్రెండ్ 2024లోకి అడుగు పెడుతున్నాం.. అంటూ టామ్ జెర్రీ  మీమ్స్ ను పోస్ట్  చేశారు.