సరికొత్త ఫీచర్..పాస్ వర్డ్ లేకుండానే లాగిన్

సరికొత్త ఫీచర్..పాస్ వర్డ్ లేకుండానే లాగిన్

పాస్ వర్డ్స్ను గుర్తు పెట్టుకోవడం అతి పెద్ద టాస్క్.  ముఖ్యంగా ఈమెయిల్ అకౌంట్స్  పాస్ వర్డ్ ను గుర్తుపెట్టుకోవడం అంటే తలనొప్పి..ఒక్కోసారి మర్చిపోతుంటాం. అందుకే పాస్ వర్డ్ మర్చిపోయినప్పుడల్లా...ఫర్గాట్ పాస్ వర్డ్ కొడుతూ కొత్త పాస్ వర్డ్ను క్రియేట్ చేసుకుంటాం. అయితే ఇకపై ఈ అవస్థలు ఉండవు. ఎందుకుంటే వినియోగదారుల కోసం  గూగుల్ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. పాస్‌కీ పేరిట గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. పాస్‌వర్డ్‌ల స్థానంలో వీటిని వాడుకోవచ్చు.

పాస్ వర్డ్స్ లేకుండానే లాగిన్..

పాస్ వర్డ్స్ లేకుండానే లాగిన్ అయ్యేందుకు గూగుల్‌ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. పాస్‌వర్డ్‌తో పని లేకుండానే లాగిన్ అయ్యేలా మార్పులు చేయబోతుంది. వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ వర్షన్‌లోనూ ఈ ఫీచర్‌ను తీసుకురానున్నట్టు వెల్లడించింది. పాస్ కీ ద్వారా పాస్‌వర్డ్‌ మర్చిపోయినా లాగిన్‌ అయ్యే ఛాన్సుంది. 

ఎలా లాగిన్ కావాలంటే 

  • కంప్యూటర్‌లో లేదా మొబైల్‌లో కానీ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి.  అందులో g.co/passkeys సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ గూగుల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
  • లాగిన్ అయిన వెంటనే కొన్ని పాస్‌కీస్ సూచనలు కనిపిస్తాయి. ఇవన్నీ ఆటో జెనరేటెడ్ పాస్‌కీస్. Use Passkey బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ ద్వారా కానీ లేదా PIN ద్వారా కానీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయాలి.
  • ఒకసారి వెరిఫికేషన్ పూర్తైన తరవాత పాస్‌కీస్ ఎనేబుల్ అయినట్టు ఓ మెసేజ్ వస్తుంది. ఇకపై ఆ పాస్‌కీస్‌తోనే లాగిన్ అవ్వచ్చు. ఏ డివైజ్‌లో అయినా ఈ ఫీచర్‌తో లాగిన్ అవ్వొచ్చు.

పాస్‌వర్డ్ లేకుంటే డేటా ఎలా సెక్యూర్డ్‌గా ఉంటుందన్న అనుమానం రావొచ్చు. అయితే ఈ సందేహానికి గూగుల్ సరైన వివరణ ఇచ్చింది. పాస్‌వర్డ్‌లు కాకుండా పాస్‌కీస్‌తో లాగిన్ అయ్యేలా మార్పు చేయనుంది. గూగుల్ అకౌంట్స్ అన్నింటికీ ఈ పాస్‌కీస్‌ అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ వినియోగదారులు పాస్‌ కీస్‌ క్రియేట్ చేసుకుంటే చాలు. గూగుల్ లాగిన్ అయ్యే సమయంలో  పాస్‌వర్డ్ కానీ లేదా వెరిఫికేషన్  అడగదు. గూగుల్‌తో పాటు యాపిల్, మైక్రోసాఫ్ట్‌ కూడా ఇదే తరహా లాగిన్‌కి మొగ్గు చూపుతున్నాయి. 

పాస్‌ కీస్ అంటే ఏమిటి

పాస్ వర్డ్,  2 స్టెప్ వెరిఫికేషన్‌ కంటే  పాస్‌కీస్‌ అనేవి చాలా సేఫ్. ఈ విషయాన్ని  గూగుల్ చెబుతోంది.ప్రతి డివైజ్‌లో  పాస్‌కీస్‌ ఫీచర్ పని చేస్తుంది.  కంప్యూటర్‌, మొబైల్ లో అన్ని  బ్రౌజర్‌లలోనూ వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏ డివైస్‌లో అయినా  సింపుల్‌గా అన్‌లాక్ చేసుకోవచ్చు. ఫేస్ రికగ్నిషన్,  ఫింగర్‌ప్రింట్, PIN ద్వారా కూడా లాగిన్ అవ్వొచ్చు.