గూగుల్లో అత్యధిక వేతనాలు పొందే ఉద్యోగాలివే..నెలకు కోట్లకు కోట్లు..అదనంగా బోనస్లు

గూగుల్లో అత్యధిక వేతనాలు పొందే ఉద్యోగాలివే..నెలకు కోట్లకు కోట్లు..అదనంగా బోనస్లు

అమెరికా టెక్ దిగ్గజం గూగుల్  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్, సెర్చ్ ఇంజన్ టెక్నాలజీ, ఇ-కామర్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌ వంటి అనేక రంగాల్లో గూగుల్ దే పైచేయి.  అందుకే గూగుల్ ను  ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సంస్థ'గా పేర్కొంటారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు అత్యుత్తమ పే ప్యాకేజీలను కూడా అందిస్తుంది.

గూగుల్ ఉద్యోగుల వేతనం ఎంతో తెలుసా..

గూగుల్ ఉద్యోగుల వేతనాలు లీకయ్యాయి. 2022లో గూగుల్ ఉద్యోగులు ఎంత జీతం పొందారు అనే వివరాలను  స్ప్రెడ్‌షీట్ అనే సంస్థ  ఓ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో మొత్తం 12 వేల మంది ఉద్యోగుల జీతాల వివరాలను పొందుపర్చారు. లీకైన నివేదిక ప్రకారం, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గూగుల్‌లో అత్యధిక జీతం పొందుతున్నారు. 

గూగుల్ లో అత్యధిక వేతనాలు పొందుతున్న టాప్ పోస్టులివే..

గూగుల్ సంస్థలో అత్యధిక వేతనాలు పొందుతున్న  టాప్ పోస్టులను గమనిస్తే..అందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఇంజనీర్ మేనేజర్, ఎంటర్‌ప్రైజ్ డైరెక్ట్ సేల్స్, లీగల్ కార్పొరేట్ కౌన్సెల్, సేల్స్ స్ట్రాటజీ, UX డిజైన్ స్థానాలు ఉన్నాయి.  2022లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మూల వేతనం రూ.5.9 కోట్లు. ఇంజినీరింగ్ మేనేజర్లు రూ. 3.28 కోట్ల వేతనంతో  రెండో స్థానంలో ఉన్నారు.  ఇక ఎంటర్‌ప్రైజ్ డైరెక్ట్ సేల్స్, లీగల్ కార్పొరేట్ కౌన్సెల్ టీమ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులకు వరుసగా రూ.3.09 కోట్లు, రూ.2.62 కోట్లు మూల వేతనాలుగా పొందుతున్నారు.  ప్రోగ్రామ్ మేనేజర్‌లు 2022లో అతి తక్కువ మూల వేతనం రూ. 2.46 కోట్లు ఆర్జించారు.  2022లో  గూగుల్ ఉద్యోగి సంపాదించిన అవరేజ్ సాలరీ రూ. 2.3 కోట్లుగా ఉంది. అయితే గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి  జీతంతో పాటు,  ఇతర బోనస్‌ల వంటి సౌకర్యాలను కూడా అందిస్తుంది.

సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న సంస్థల్లో గూగుల్ టాప్ 1లో కొనసాగుతుండగా..ఫేస్ బుక్ మాతృ సంస్థ Meta రెండవ స్థానంలో ఉంది.  Google యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్ అత్యధికంగా చెల్లించే కంపెనీలలో మూడవ స్థానంలో ఉంది.  అయితే లీక్ అయిన  డేటా అమెరికాలో పని చేసే  ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది. 

సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతున్న గూగుల్... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెట్టింది. కృత్రిమ మేధస్సు  పరీక్షను ప్రారంభించింది.  ఇది జర్నలిస్టులకు వార్తాలు రాయడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా తయారు చేస్తోంది.  దీనికి  జెనెసిస్ అని పేరు పెట్టారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఈవెంట్‌ల సమాచారాన్ని తీసుకోని..వార్తలు రాయగలదు.