10 లక్షల మంది మహిళలతో వ్యాపారాలు పెట్టిస్తాం

10 లక్షల మంది మహిళలతో వ్యాపారాలు పెట్టిస్తాం

ఇందుకోసం ఇంపాక్ట్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌

నాస్కామ్‌‌‌‌కు 5 లక్షలు, ఎన్జీఓలకు 2.5 కోట్ల డాలర్లు

న్యూఢిల్లీ: ఇండియాలోని 10 లక్షల మంది గ్రామీణ మహిళలను ఎంట్రప్రిన్యూర్లుగా మారుస్తామని ఇంటర్నేషనల్‌‌‌‌ విమెన్స్ డే సందర్భంగా గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం బిజినెస్‌‌‌‌ ట్యుటోరియల్స్‌‌‌‌, టూల్స్‌‌‌‌, మెంటరింగ్‌‌‌‌ వంటి కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించింది. మహిళల డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ఇది వరకే టాటాలతో కలసి నిర్వహించిన ఇంటర్నెట్‌‌‌‌సాథీ కార్యక్రమం ముగింపు సందర్భంగా సోమవారం ఢిల్లీలో ‘విమెన్‌‌‌‌ విల్’ మీటింగ్‌‌‌‌ నిర్వహించింది. ఇండియాలోని మూడు లక్షల గ్రామాల్లో మూడు కోట్ల మంది మహిళలకు కంప్యూటర్‌‌‌‌ వాడకం, డిజిటల్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ నేర్పించేందుకు ఇంటర్నెట్‌‌‌‌ సాథీ నిర్వహించారు. మహిళా ఎంట్రప్రిన్యూర్లను తయారు చేయగలిగితే లక్షలాది మందికి ఉపాధి కల్పించవచ్చని, డిజిటల్ ఎకానమీ వల్ల ఎక్కువ మంది లాభం పొందేలా చేయవచ్చని గూగుల్‌‌‌‌ సీఈఓ సుందర్‌‌‌‌ పిచాయ్‌‌‌‌ అన్నారు. కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ విమెన్ విల్‌‌‌‌ కార్యక్రమంలో మాట్లాడుతూ మనదేశంలో డిజిటల్‌‌‌‌ టెక్నాలజీ విరివిగా వాడుతున్నారని, దీనివల్ల మహిళలు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని చెప్పారు.

మహిళ ఎదిగితే దేశం ఎదిగినట్టే...

‘‘మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. వారి ఆలోచనలు,క్రియేటివిటీ, నైపుణ్యం వల్ల దేశం బాగుపడుతుంది. ఇతర దేశాల్లో మహిళా ఎంట్రప్రిన్యూర్లు ఎన్నో అద్భుతాలు సాధించారు. అయితే ఇప్పటికీ మహిళలకు సమాన అవకాశాలు దక్కడం లేదు. ఇంటర్నెట్‌‌‌‌ సాథీ సక్సెస్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌తో పది లక్షల మంది పల్లెటూరి మహిళలను ఎంట్రప్రిన్యూర్లుగా మార్చాలని నిర్ణయించాం. ఇందుకోసం బిజినెస్‌‌‌‌ ట్యుటోరియల్స్‌‌‌‌, టూల్స్‌‌‌‌, మెంటర్‌‌‌‌షిప్‌‌‌‌ వంటివాటిని ఉపయోగించుకుంటాం. మహిళలకు అన్ని విధాలా సహకారం అందిస్తాం’’ అని గూగుల్‌‌‌‌ సీనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఒకరు చెప్పారు. గ్రామీణ మహిళలకు తోడ్పాటును అందించడానికి ఈ టెక్‌‌‌‌ కంపెనీ ‘విమెన్‌‌‌‌ విల్‌‌‌‌ వెబ్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌’ను కూడా మొదలుపెట్టింది. తోటి మహిళల నుంచి సాయం పొందడానికి, సలహాలు సూచనలు తీసుకోవడానికి, వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. మహిళల హాబీలను, ట్యాలెంట్లను బిజినెస్‌‌‌‌ గా ఎలా మల్చుకోవాలో నేర్పిస్తారు. టైలరింగ్‌‌‌‌, బ్యూటీ సర్వీసెస్‌‌‌‌, హోంట్యూషన్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ వంటి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ట్రైనింగ్‌‌‌‌ ఇస్తారు.

ఇంపాక్ట్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌లో భాగంగా వ్యవసాయ రంగంలోని మహిళలకు స్కిల్స్ నేర్పించి ఎంట్రప్రిన్యూర్లుగా మార్చడానికి గూగుల్‌‌‌‌ నాస్కామ్‌‌‌‌కు ఐదు లక్షల డాలర్లు ఇస్తామని పిచాయ్‌‌‌‌ ప్రకటించారు.  ఆర్థిక అసమానతల నుంచి ఉత్తరాది రాష్ట్రాల మహిళలను బయటికి తీసుకురావడం, స్కిల్స్‌‌‌‌ సాధించి సొంతంగా ఎదిగేలా వారిని తీర్చిదిద్దగల ఎన్జీఓలకు, సోషల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌‌‌కు 25 మిలియన్ల డాలర్లు ఇస్తామని  గూగుల్‌‌‌‌ తెలిపింది. ‘‘కరోనా వల్ల మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా జాబ్స్‌‌‌‌ కోల్పోయారు. దాదాపు రెండు కోట్ల మంది స్కూళ్లకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించే అవకాశం మనకు ఉంది. ఇందుకోసం మేం ఎన్జీఓల నుంచి, సోషల్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ ఆర్గనైజేషన్ల నుంచి సలహాలు కోరుతున్నాం. ఆసక్తి ఉన్న ఎన్జీఓలు, ఆర్గనైజేషన్లలో వచ్చే నెల 9 లోపు వారి సలహాలను సూచనలను అందజేయవచ్చు’’ అని పిచాయ్‌‌‌‌ వివరించారు.