గూగుల్ సెర్చ్‌‌లో ఎక్కువగా వెతికిన పదాలివే

గూగుల్ సెర్చ్‌‌లో ఎక్కువగా వెతికిన పదాలివే

న్యూఢిల్లీ: ప్రపంచం ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు. టీకాలు అందుబాటులోకి వచ్చాక దాదాపుగా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపించింది. కానీ మళ్లీ కరోనా ఉధృతి ఎక్కువవుతోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో చాలా పరిశ్రమలు నష్టపోయాయి. ఏడాది కాలం గడుస్తున్నా ఇంకా చాలా రంగాలు కోలుకోలేదు. ఇంకా కరోనా ఎన్నాళ్లు ఉంటుందో తెలియడం లేదు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. ఈ మహమ్మారి టైమ్‌లో దాదాపుగా చాలా మంది వర్కర్స్, కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌‌కు ఓకే అంటున్నాయి. 

స్టూడెంట్స్ కూడా ఆన్‌లైన్ కోర్సుల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. అందుకే ఈ రెండు పదాలు గతేడాది గూగుల్‌‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలుగా నిలిచాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఆన్‌లైన్ కోర్సు, హౌ టూ సెల్ ఆన్‌‌లైన్, సర్టిఫికేట్ కోర్సు లాంటి పదాలను నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ తెలిపింది. WFH (వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్), ఈ –కోర్సులు అనే కీవర్డ్స్‌‌ను మన దేశంలో ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ యానువల్ రిపోర్టు వెల్లడించింది. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే సర్చ్ చేశారని, ఆ తర్వాత కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలోని నెటిజన్స్ సెర్చ్ చేశారని గూగుల్ తెలిపింది. వర్క్ ఫ్రమ్ జాబ్స్, ఆన్‌‌లైన్ క్లాసెస్‌కు డిమాండ్ పెరగడంతో చాలా మంది ప్రజలు సెకండ్ హ్యాండ్ ల్యాప్‌‌టాప్ కొనాలని ఉత్సాహం చూపారని ఈ రిపోర్టు ద్వారా తెలుస్తోంది.