టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ అడ్వెంచర్ 'భారత వర్ష' (Bharata Varsha) . ఇప్పుటికే షూటింగ్ దాదాపు పూర్తిచేసుకున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. లేటెస్ట్ గా దసరా నవరాత్రుల శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 'వీర జయధీర' చార్ట్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా 'అమ్మ కదిలి వచ్చే' అనే ఆధ్యాత్మిక గీతాన్ని విడుదల చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ స్వరపరిచిన.. ఈ పాట దుర్గామాత దివ్యత్వాన్ని, భక్తుల ఉత్సాహాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ సాంగ్ నెట్టింట్ వైరల్ అవుతోంది.
ఈ పాటలో వివిధ ప్రాంత ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే 'శూలాంభ అమ్మ'దివ్యోత్సవాన్ని, విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను ఎంతో వైభవంగా చూపించారు. భక్తుల కోలాహలం, డప్పు చప్పుళ్లు, ఉప్పొంగే భక్తిపారవశ్యం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగాశూలాంభ అమ్మవారి జాతర వైభవాన్ని, శక్తి పీఠాల విశిష్టతను ఈ విజువల్స్ గుర్తుచేస్తున్నాయి.
►ALSO READ | Prabhas : 'ఫౌజీ' హీరోయిన్ కి ప్రభాస్ రాయల్ బర్త్డే ట్రీట్.. నాన్వెజ్ విందుతో కడుపు నింపేసిన డార్లింగ్!
గేయ రచయిత కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన శక్తివంతమైన సాహిత్యం అమ్మవారి తొమ్మిది రూపాలైన .. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి విశిష్టతను ప్రతిబింబించింది. గాయకుడు స్కంద వేలువాలి తో పాటు బృందం పాడిన తీరు ఈ పాటను ఒక రేంజ్కి తీసుకెళ్లింది. గోపీచంద్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా, పండగ వాతావరణంలో వీరిద్దరి ప్రెజెన్స్ ఆకట్టుకుంది. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ నుంచి త్వరలోనే మరిన్ని క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.
