కోచింగ్‌‌‌‌ స్కూల్‌‌‌‌ను ప్రారంభించిన గోపీచంద్‌‌‌‌, నీరజ్‌‌‌‌

కోచింగ్‌‌‌‌ స్కూల్‌‌‌‌ను ప్రారంభించిన గోపీచంద్‌‌‌‌, నీరజ్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్పోర్ట్స్‌‌‌‌ను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో బ్యాడ్మింటన్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ పుల్లెల గోపీచంద్‌‌‌‌, జావెలియన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా సంయుక్తంగా ‘ఇండియన్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కోచింగ్‌‌‌‌ ఎక్సలెన్స్ (ఐఎస్‌‌‌‌సీఈ)’ను గురువారం ప్రారంభించారు. దేశంలో నాణ్యమైన కోచ్‌‌‌‌లను తయారు చేయడం, క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. 

క్రీడా విజ్ఞానం, ఫిజికల్ లిటరసీ, స్పోర్ట్స్ సైన్స్, టెక్నాలజీ రంగాలను అనుసంధానించడం ద్వారా ప్రపంచ స్థాయి కోచ్‌‌‌‌లను తీర్చిదిద్దడానికి ఐఎస్‌‌‌‌సీఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌‌‌‌), వివిధ క్రీడా ఫెడరేషన్లు, ప్రైవేట్ రంగంతో కలిసి ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రపంచ స్థాయి పద్ధతులను భారతీయ అనుభవంతో జోడించి కోచ్‌‌‌‌లకు శిక్షణ ఇస్తామని గోపీచంద్‌‌‌‌ అన్నాడు.