టాటా మోటార్స్ ప్రాఫిట్ 80 శాతం డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టాటా మోటార్స్ ప్రాఫిట్ 80 శాతం డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముంబై:  కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏప్రిల్–-జూన్) లో  ఇన్వెస్టర్లను నిరాశపరిచింది.  కంపెనీ నికర లాభం ఏడాది లెక్కన 80 శాతం తగ్గి  రూ. 775 కోట్లకు పరిమితమైంది. సబ్సిడరీ కంపెనీ  జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  అమ్మకాలు తగ్గడం, ఆఫర్లు/ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు భారీగా ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. 

అయినప్పటికీ దేశీయంగా అమ్మకాలు పెరగడంతో  కంపెనీ రెవెన్యూ  ఏడాది లెక్కన  9.2 శాతం పెరిగి రూ. 95,799 కోట్లకు చేరింది.   సప్లయర్  వద్ద అగ్నిప్రమాదం, పశ్చిమాసియా సంక్షోభం, అమ్మకాలు తగ్గడం వల్ల జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబడి 9.6శాతం తగ్గి 5.97 బిలియన్ పౌండ్ల (దాదాపు రూ.67 వేల కోట్ల) కు పడిపోయింది.