
టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్(Gopichand) హీరోగా మాస్ ఎంటర్టైనర్ భీమా(Bimaa). కన్నడ దర్శకుడు హర్ష(A Harsha) తెరకెక్కించిన ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో మాళవిక శర్మ(Malavika sharma), ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) హీరోయిన్స్ నటించారు.
గోపీచంద్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ సినిమా మార్చ్ 8 శివరాత్రి కానుకగా విడుదలై సూపర్ హిట్ నిలిచింది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ లవర్స్ ను ఫుల్లుగా నచ్చేసింది. కానీ, ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఆశించిన మేర వసూళ్లు రాలేదు. చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న గోపిచంద్ కు మంచి కంబ్యాక్ ఇచ్చిందనే కంటే..ఆశలు పెంచుకున్న మూవీ తగిన ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పుకోవాలి.
ఈ సినిమా డిజిటల్ హక్కులను రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. “యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ భీమాను ఏప్రిల్ 25న మీ స్క్రీన్‍లపైకి తీసుకొస్తున్నాం” అని హాట్‍స్టార్ ట్వీట్ చేసింది. ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. మరి థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
కథేంటంటే:
స్థలపురాణం ఉన్న మహేంద్రగిరిలో జరిగే కథ ఇది. పరశురామ క్షేత్రం కొలువైన ఆ ప్రాంతంలో భవానీ (ముఖేష్ తివారి) ముఠా ఎన్నెన్నో అరాచకాలు కొనసాగిస్తుంటుంది. ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేయడంతో పాటు, అడ్డొచ్చిన పోలీసుల్ని సైతం అంతం చేస్తుంటుంది. అలాంటి ప్రాంతానికి భీమా (గోపిచంద్) ఎస్సైగా వస్తాడు. వచ్చీ రావడంతోనే భవానీ ముఠా ఆట కట్టించేందుకు నడుం బిగిస్తాడు. అటవీ ప్రాంతం నుంచి ఈ ముఠా తీసుకెళుతున్న ట్యాంకర్లపై నిఘా వేస్తాడు. వాటి జోలికి ఎవరొచ్చినా అస్సలు ఊరుకోని భవానీ ఏం చేశాడు? అసలు ఆ ట్యాంకర్లలో దాగిన రహస్యమేమిటి? భవానీని ముందు పెట్టి వెనక కథ నడిపిస్తున్న ఓ పెద్ద మనిషి కథేమిటి?పరశురామ క్షేత్రం మూతపడటానికీ, ఈ ముఠాకీ సంబంధం ఏమైనా ఉందా? ఆ క్షేత్రం తలుపులు మళ్లీ తెరచుకున్నాయా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.