గోపిచంద్-శ్రీను వైట్ల కాంబో సెట్.. టైటిల్ ఏంటంటే?

గోపిచంద్-శ్రీను వైట్ల కాంబో సెట్.. టైటిల్ ఏంటంటే?

టాలీవుడ్ లో ఉన్న  యాక్షన్ హీరోలల్లో ఒకరైన గోపిచంద్(Gopichand)..మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకొని కెరీర్లో దూసుకుపోతున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ  తన హవా కొనసాగిస్తూన్నారు. రీసెంట్ గా రామబాణం మూవీతో నిరాశపరిచారు. ఇక లేటెస్ట్ గా గోపిచంద్ మరో క్రేజీ డైరెక్టర్ శ్రీను వైట్ల తో మూవీ తీస్తున్నారట. కామెడీకి కమర్షియ ల్ టచ్ ను జోడించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుపొందారు శ్రీను వైట్ల(Srinuvaitla). ఇక గోపీచంద్ కోసం కామిక్ ఎంటర్ టైనర్ లో కథ చెప్పించి ఒప్పించాడని తెలుస్తోంది.  

ఈ మూవీకు టైటిల్ కూడా ఒకే చేశారని సమాచారం. అలాగే  గోపీచంద్ హిట్ మూవీస్ ఎక్కువగా మూడు అక్షరాలు ఉండటంతో.. విశ్వమ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.  ఇక శ్రీను వైట్ల మూవీస్ కూడా మూడు అక్షరాలతో హిట్ కొట్టాయి. ఇక వీరిద్దరి సెంటిమెంట్ కు తగ్గ ఫలితం వస్తోందని గట్టి నమ్మకంతో మూవీ స్టార్ట్ చేయనున్నట్లు టాక్.  

కాగా శ్రీను వైట్ల  ఆగడు,మిస్టర్‌,అమర్‌ అక్బర్‌ ఆంటోని వంటి మూవీస్ తో భారీ డిజాస్టర్స్ తెచ్చుకున్నారు. దీంతో చాలా కాలం నుంచి మూవీస్ కు దూరంగా ఉంటూ..ఇక ఆయనకు సెట్ అయ్యే జోనర్ లోనే అద్దిరిపోయే కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి విశ్వమ్ కు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. 

కన్నడ డైరెక్టర్ హర్షవర్ధన్ తెరకెక్కిస్తున్న గోపీచంద్ మూవీకు భీమా(Bheema) అనే పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ పోస్టర్ లో  గోపీచంద్ లుక్స్‌తో అద్భుతంగా ఉంది. ఇందులో గోపీచంద్‌తో పాటు ఒంగోలు ఎద్దు హైలెట్ గా నిలిచింది. అలాగే ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఈ మూవీకు KGF,సలార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.