786 నంబరు ఉంటే కాసుల పంటే!

786 నంబరు ఉంటే కాసుల పంటే!

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు:   ‘786’ నంబరుపై కొంతమంది చాలా ఆసక్తి చూపిష్ట్రస్తారు.  ఈ నంబరు కలిగిన వస్తువు ఏదైనా తమ దగ్గర ఉంటే మేలు జరుగుతుందని నమ్ముతారు. 786 సీరియల్‌‌ నంబరు కలిగిన  కరెన్సీ నోటును దక్కించుకోవడానికి చాలా ఖర్చు పెడతారు. కాబట్టి..ఇది ఉన్న వారికి పైసల పంటే! ఇట్లాంటి నోట్లను రూ.లక్షలు పెట్టి కొనేందుకు కూడా చాలా మంది రెడీగా ఉంటారు. ఈబే వంటి ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ సైట్లలో 786 సిరీస్‌‌ నోట్లను అమ్మకానికి పెట్టొచ్చు. అరుదైన కరెన్సీ నోట్లు, నాణేలు ఉన్నా లక్షలు సంపాదించుకోవచ్చు. ప్రత్యేకమైన సిరీస్​ నంబర్లు, బొమ్మలు, గుర్తులు ఉన్న కరెన్సీకి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ కరెన్సీ విలువ ఎంత చిన్నదైనా సరే.. అమ్మితే మాత్రం భారీగా డబ్బు వస్తుంది. ఈబేతోపాటు చాలా వెబ్‌‌సైట్లు అరుదైన కరెన్సీలను అమ్ముతున్నాయి.  ఈబేలో  కరెన్సీ నోట్లను అమ్మే విధానం ఇది. 

 1: www.ebay.com కి వెళ్లండి.
 2: హోమ్‌‌పేజీలోని రిజిస్ట్రేషన్ ట్యాబ్‌‌పై క్లిక్ చేసి, మిమ్మల్ని మీరు సెల్లర్‌‌గా రిజిస్టర్‌‌ చేసుకోండి.
3: మీరు అమ్మాలనుకుంటున్న నోటు ఫొటోను ఇందులో అప్‌‌లోడ్ చేయండి. ఫొటో స్పష్టంగా కనిపించాలి.  .
4: ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు మీ ప్రకటన చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు. వాళ్లు ఆఫర్‌‌ చేసిన ధర నచ్చితే నోటును అమ్మవచ్చు