శ్రీలంక అధ్యక్షుడి రాజీనామా

శ్రీలంక అధ్యక్షుడి రాజీనామా

దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సింగపూర్ నుంచి శ్రీ‌లంక పార్లమెంట్ స్పీక‌ర్‌కు పంపించారు. గొటబాయ పంపించిన లేఖ అందిందని స్పీక‌ర్ తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే కొనసాగుతున్నారు. గొటబాయ రాజీనామా చేయడంతో శ్రీలంకలో సంబరాలు మొదలయ్యాయి. ముందుగా శ్రీలంక నుంచి పారిపోయిన గొటబాయ అక్కడి నుండి మాల్దీవులకు చేరుకున్నారు. మళ్లీ అక్కడినుండి సింగపూర్ కు వెళ్లారు. అయితే గొటబాయకు తాము ఆశ్రయం ఇవ్వలేదని, వ్యక్తిగతం గానే ఆయనకు ఇక్కడికి వచ్చినట్లుగా సింగపూర్ ప్రభుత్వం తెలిపింది.