కాలిఫోర్నియాలో ఘోర ప్రమాదం జరిగింది.అమెరికా వైమానిక దళానికి చెందిన బి52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబార్ విమానం మొజావే ఎడారిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది సిబ్బంది చనిపోయారు. మొజావో ఎడారిలో రాడార్ మోడిఫికేషన్ లో భాగంగా టెస్టింగ్ మిషన్ నిర్వమిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం కూలిపోయింది.
రెగ్యులర్ టెస్టింగ్ మిషన్‌లో ఉన్న ఆ విమానం..లాస్ ఏంజిల్స్‌కు ఈశాన్యంగా ఉన్న సైనిక స్థావరం సమీపంలో కూలిపోయింది. సుమారుగా సోమవారం (జూన్ 14) ఉదయం 11:20 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది స్పాట్ లో చనిపోయారు.. మృతదేహాల వెలికితీత కొనసాగుతుందని ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్ ధృవీకరంచింది.
B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అనేది US వైమానిక దళంలో ఇప్పటికీ క్రియాశీలకంగా సేవలో ఉన్న అత్యంత పురాతన విమానాలలో ఒకటి. 1955లో మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన ఈ సుదూర ప్రయాణ భారీ బాంబర్, అమెరికా వ్యూహాత్మక ఆయుధాగారంలో ఓ కీలక భాగం.
