Good Health : ఇవి తింటే లావెక్కరు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కూడా..!

Good Health : ఇవి తింటే లావెక్కరు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కూడా..!

ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఉంటే ఉన్న అదనపు బరువు ఉన్న వారిని ఊబకాయులు అంటారు. వీరిలో అదనంగా ఉన్న లావును బట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అసలు అలా ఉండటమే ఒక అనారోగ్యం. ఏవో కొన్ని వైద్య పరమైన సమస్యలు ఉన్న వారిలో తప్ప లావు కావటం అనేది నూటికి 98 పాళ్ళు "తిండి-కష్టం"ల  మధ్య మనకు మనమే తూకాన్ని దెబ్బ తీయటం వల్ల కొని తెచ్చు కొనే సమస్య. ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. . .!

చాలామంది ఏదో పనిలో ఉంటూ భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంత తింటున్నా రో? గమనించరు. ఇలా చేసేవాళ్లు25 శాతం ఎక్కువ ఆహారం తీసుకుంటున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. తీరా బరువు పెరిగాక.. ఏం చేయాలో అర్థం కాదు. అయితే, కొన్ని ఫ్రూట్స్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఒబెసిటి సమస్యను తగ్గించుకోవచ్చని దాక్ష ర్లు సలహా ఇస్తున్నారు. 

ఇందులో ముఖ్యమైనవి జామపండ్లు. ఇవి ఏ కాలంలోనైనా దొరుకుతాయి. జామపండ్లు తినడం వల్ల అజీర్తి సమస్యలు పోతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి శరీర బరువుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

 నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయల్ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచింది. పుచ్చకాయ తినడం వల్ల ఆకలి సమస్య ఉండదు. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం లేదు. అనేక పోషకాలు కలిగిన ఆపిల్స్ తినడం వల్ల బరువు ఈజీగా తగ్గొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి బరువుని తగ్గిం చడానికి ఉపయోగపడతాయి.  బ్లాక్ బెర్రీ, కాన్ బెర్రీ, స్ట్రాబె క్రీ, బ్లూ బెర్రీలు లాంటివి బరువుని తగ్గించేవే. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది