గవర్నర్లను కేసీఆర్ అవమానించిండు : తమిళిసై

గవర్నర్లను కేసీఆర్ అవమానించిండు : తమిళిసై

ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ పై గవర్నర్ తమిళి సై స్పందించారు. గవర్నర్లను సీఎం కేసీఆర్ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను ముఖ్యమంత్రులు ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్పై సీఎం కేసీఆర్ స్పందించిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెప్తానని తమిళి సై స్పష్టం చేశారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నానని.. ప్రొటోకాల్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు.

రిపబ్లిక్ డే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని గవర్నర్ తమిళి సై చెప్పారు. బడ్జెట్ సమావేశాలు కూడా త్వరలో జరగనున్నాయని,  ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పలు రాష్ట్రాల్లో.. గవర్నర్లతో విపక్ష ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయిస్తున్నారని ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ సహా కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే.