సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లకు కేంద్రం హెచ్చరిక .. డీప్ఫేక్ వీడియోలు తొలగించకుంటే కఠిన చర్యలు

సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లకు కేంద్రం హెచ్చరిక ..  డీప్ఫేక్ వీడియోలు తొలగించకుంటే కఠిన చర్యలు

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నుంచి వచ్చే సవాళ్లలో డీప్ ఫేక్ అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. డీప్ ఫేక్ తప్పుడు సమాచారాన్ని గుర్తించి తొలగించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 

ఇటీవల నటుడు అక్షయ్ కుమార్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఓ వీడియోలో ఈ సూపర్ స్టార్ ఓ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్లు చూపబడింది. వాస్తవానికి అక్షయ్ కుమార్ అలాంటి ప్రచారం చేయడం లేదు.. అలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొనలేదు. 

ఇంతకుముందు పాన్ ఇండియా నటి రష్మిక మందన్న, నోరా ఫతేహీ, కత్రినా కైఫ్, కాజోల్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.దీనిపై స్పందిచన కేంద్రం డీప్ ఫేక్ నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)   వల్ల కలిగే తప్పుడు సమాచారం , డీప్ ఫేక్ లు ఉన్నాయని ఐటీ రూల్స్ 2021 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.