బీసీలను దగా చేసిన ప్రభుత్వం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

బీసీలను దగా చేసిన ప్రభుత్వం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

బషీర్​బాగ్, వెలుగు: బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ మాట తప్పి బీసీలను రాజకీయంగా దగా చేసిందని మాజీ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్వరంలో జీవో 46ను రద్దు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని, ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బర్కత్ పురాలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

లింగంపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 42శాతం రిజర్వేషన్లను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. 17 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. రీయింబర్స్, స్కాలర్​షిప్ బకాయిలు రూ.10 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్సింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నందగోపాల్, మోహన్, వేణు, రాజేశ్​ తదితరులు పాల్గొన్నారు.