
హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 1 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
బుధవారం (అక్టోబర్ 22) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాలు ఉన్నవారికి జీ ప్లస్ 1 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
►ALSO READ | Trafic voilence: సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ.. దొరికితే కోర్టుకు వెళ్లాల్సిందే: సీపీ సజ్జనార్
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో కనీసం 30చ.గ. విస్తీర్ణంలో జీప్లస్-1 నిర్మాణానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జీవో 69 విడుదల చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్ధిక సహయం చేస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం లబ్దిదారులకు దశల వారీగా రూ.5 లక్షలు ఇస్తామన్నారు.