Trafic voilence: సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ.. దొరికితే కోర్టుకు వెళ్లాల్సిందే: సీపీ సజ్జనార్

Trafic voilence: సెల్ ఫోన్  డ్రైవింగ్ చేస్తూ.. దొరికితే కోర్టుకు వెళ్లాల్సిందే: సీపీ సజ్జనార్

హైదరాబాద్​ సిటీలో సెల్​ ఫోన్​ డ్రైవింగ్​పై నజర్​పెట్టారు కొత్త సీపీ సజ్జనార్. సీపీ ఆదేశాల మేరకు  వారం రోజులుగా ట్రాఫిక్​ పోలీసులు సిటీ మొత్తం స్పెషల్​ డ్రైవ్​ లు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్​ రూల్స్​ పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. సెల్​ ఫోన్​చూస్తూ, సెల్​ ఫోన్​ మాట్లాడుతూ డ్రైవింగ్​ చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు ట్రాఫిక్​ పోలీసులు. ఇప్పటివరకు 3500 కేసులు నమోదు చేశారు. 

కొందరు డ్రైవింగ్​ చేస్తూ రీల్స్​, సినిమాలు, క్రికెట్​ మ్యాచ్​ లు చూస్తున్నారు. ఫోన్లు, మినీ టీవీలతో డ్రైవింగ్​పై కాన్సంట్రేషన్​ పోతుంది. సెల్​ ఫోన్ మాట్టాడినప్పుడు డ్రైవర్​ అటెన్షన్​ డైవర్ట్​ అవుతుంది.సెల్​ ఫోన్​ డ్రైవింగ్​తో రోడ్డు ప్రమాదాలు జరిగే ఛాన్స్​ ఎక్కువగా ఉందన్నారు ట్రాఫిక్​ డీసీపీ శ్రీనివాస్​. వారం నుంచి 3600 సెల్​ ఫోన్​ డ్రైవింగ్​  కేసులు నమోదు చేశాం..సెల్​ ఫోన్​ డ్రైవింగ్​ లో పట్టుబడితే కోర్టు వెళ్లాల్సిందేనన్నారు. కోర్టు తీర్పును బట్టి చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ శ్రీనివాస్