విద్యాసంస్థల ప్రారంభానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ 

V6 Velugu Posted on Jun 10, 2021

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16 నుంచి న్యూ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతోంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. గతేడాదిలాగే విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాప్తి తగ్గు ముఖం పడితే వచ్చే నెల(జులై)లో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం.

Tagged government, TS state, opening of educational institutions, issued directions

Latest Videos

Subscribe Now

More News